అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన యువకులు

0చూసినవారు
అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన యువకులు
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఓ పేద కుటుంబానికి రాజుగుంటకు చెందిన గుత్తి నరసింహ, నానబాల నాగార్జున అండగా నిలిచారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం కల్పించి, నిత్యావసరాలు, గృహోపకరణాలను తమ సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న యువకులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్