వీఆర్వోపై యువకులు దాడి

1683చూసినవారు
పుల్లంపేట మండలం అనాసముద్రంలో బుధవారం సాయంత్రం విఆర్వో సుబ్బరాయుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోతో ఢీకొట్టి, ప్రశ్నించినందుకు యువకులు సుబ్బరాయుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలై, మూడు ముందు పళ్లు విరిగిపోయాయి. స్థానికులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్