రైల్వే కోడూరు మండలం తిమ్మిశెట్టిపల్లి, వీవీ కండ్రిగ గ్రామాల్లో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ నిర్మాణ రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే కొండంత బలమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్రమ కేసులకు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.