ప్రభుత్వం ప్రకటించిన చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. సిద్దవటం మండలం చేనేత జౌళి శాఖ ఏడీఓ వనిత మాధవరం-1 గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక చేనేత సొసైటీ ప్రతినిధుల సహకారంతో అర్హులైన కార్మికుల నుంచి అధికారులు దరఖాస్తులు, పత్రాలు స్వీకరించారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి వచ్చే నెల నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ఏడీఓ తెలిపారు.