రాజంపేటలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

2231చూసినవారు
రాజంపేటలోని శ్రీ రంగరాజపురంలో ఆదివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బినామీ పేర్లతో ఆక్రమించిన సుమారు 50 ఎకరాల భూమిలోని కంచెలను జేసీబీలతో తొలగించి, ఆ భూమి ప్రభుత్వ స్థలమని తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీసుల భద్రత మధ్య తహసీల్దార్ దస్తగిరి ఈ తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించారు. సుమారు 50 ఎకరాల భూమిని ప్రభుత్వ స్థలంగా గుర్తించి, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్