పట్టాదారు భూమి కలిగిన రైతులు పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఉపాధి హామీ ఏపీవో నరసింహులు మంగళవారం సూచించారు. సిద్దవటం మండలం టక్కోలి గ్రామ ఎస్సీ కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐదు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఉపాధి హామీ పథకం ద్వారా గులాబీ, మల్లె, మునగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర మొక్కలను 100 శాతం ఉచితంగా పొందవచ్చని తెలిపారు. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఉద్యాన శాఖ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించారు.