వీఐపీ పాసులు ఉన్నా విలేఖరులను అడ్డుకున్న ఎఎస్పీ – వాగ్వివాదం

2401చూసినవారు
ఒంటిమిట్టలో జరిగిన కార్యక్రమంలో వీఐపీ పాసులు ఉన్నప్పటికీ విలేఖరులను రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే అడ్డుకున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. భద్రతా కారణాల దృష్ట్యా విధుల్లో భాగంగానే ఇలా చేశామని పోలీసులు పేర్కొన్నారు. అయితే, తమకు అనుమతి పాసులు ఉన్నా లోపలికి అనుమతించకపోవడంపై విలేఖరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనపై వివరణ కోరారు విలేఖరులు.

సంబంధిత పోస్ట్