సుండుపల్లిలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

330చూసినవారు
సుండుపల్లిలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
సుండుపల్లి మండలం మడితాడులో గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. రాయవరం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చర్మంపై స్పర్శ లేని మచ్చలు, ముఖం, చెవులు, ఛాతీపై మచ్చలు, కనురెప్పలు రాలిపోవడం, ముక్కు దూలం కుంగిపోవడం, చేతులు, పాదాల్లో పుండ్లు వంటి లక్షణాలు కుష్టు వ్యాధిగా అనుమానించవచ్చని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందిస్తామని, 12 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్