చిట్వేల్ లో రోడ్లపైకి వరద నీరు, రాకపోకలకు అంతరాయం

3294చూసినవారు
చిట్వేల్ లో రోడ్లపైకి వరద నీరు, రాకపోకలకు అంతరాయం
చిట్వేల్ మండలంలో భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి వరద నీరు చేరింది. ముఖ్యంగా, రాపూరు-చిట్వేల్ ప్రధాన రహదారిపై రాజుకుంట నుంచి వచ్చే అలుగు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్లమ్మ రాజు చెరువుకు చేరుతున్న నీరు రోడ్డును దాటుతూ ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్