రాజంపేట నియోజకవర్గంలో ప్రతి నెలా ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం తెలిపారు. ఈ నెల 16న రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడుతుంది. ప్రజలకు రవాణా, భోజన సౌకర్యాలు కూడా కల్పించబడతాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రతినెల జాబ్ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.