రాజంపేట మండలం హస్తవరం చెర్లోపల్లెకు చెందిన పొన్నుపల్లి నరసింహులు (53) అనే పుల్ల ఐస్ వ్యాపారి, గురువారం పెనగలూరు మండలం చక్రంపేటలో అమ్మడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎండలో కుప్పకూలి మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆకేపాటి పరామర్శించారు.