నందలూరు మండలం కడప-చెన్నై జాతీయ రహదారిపై చెయ్యేరు బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరివరం పెంచలయ్య (50) అనే వ్యక్తి మృతి చెందారు. నీలిపల్లికి చెందిన పెంచలయ్య కాలినడకన వెళ్తుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పెంచలయ్యను రాజంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.