సిద్దవటం మండలంలోని మూలపల్లె ఎస్సీ కాలనీలో శనివారం పంచాయతీ సెక్రటరీ రియాజ్ గ్రామస్తులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిశుభ్రంగా ఉంటే అంటువ్యాధులు దరిదాపుకు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. ఎంపీడీవో ఫణి రాజకుమారి ఆదేశాల మేరకు ప్రజలకు పారిశుధ్యం ప్రాముఖ్యత వివరించిన ఆయన గ్రీన్ అంబాసిడర్ వాహనంలో తడి-పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని సూచించారు. త్రాగునీరు, విద్యుత్ దీపాలు వంటి సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని, ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులకు సూచించారు.