సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరయ్యగారిపల్లి గ్రామంలో శనివారం ఎస్‌ఐ హారిక ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళల భద్రత కోసం 'శక్తి' యాప్ వినియోగం, చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ హారిక పిలుపునిచ్చారు.