ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి వస్తానని నిర్మాత గణేశ్ ప్రతిజ్ఞ

1660చూసినవారు
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఈ ఏడాది ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న సీతారాముల కళ్యాణానికి తప్పక వస్తానని తెలిపారు. గురువారం తిరుమలకు పాదయాత్రలో భాగంగా ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆ దేవదేవుని దర్శనం తర్వాతే మిగతా ఆలయాలను దర్శిస్తానని చెప్పారు. కడప జిల్లా రాళ్ల సీమ కాదని, రతనాలసీమని పాదయాత్రలో స్వయంగా చూశానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్