రాజంపేటలోని అపోలో ఫార్మసీ వద్ద మందులు, ఫుడ్ ప్రొడక్ట్స్, సెర్లాక్ వంటి ఉత్పత్తులను ఎండలో రోడ్డుపై టేబుళ్లపై ఉంచి విక్రయిస్తున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన ఉత్పత్తులను బహిరంగంగా ఉంచడం వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమని శనివారం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.