రాజంపేట: దంపతులపై మూకుమ్మడి దాడి

627చూసినవారు
రాజంపేట మండలం శవనవారిపల్లి పంచాయతీ అరుంధతివాడకు చెందిన పల్లెపాకు శివయ్య (48)పై అదే గ్రామానికి చెందిన సుమారు పది మంది మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితుడు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిగిన గొబ్బెమ్మ ఊరేగింపులో తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న నిందితులు శుక్రవారం సాయంత్రం శివయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిలో అంగన్వాడి టీచర్‌గా పని చేస్తున్న వెలగచెర్ల వెంకట లక్ష్మమ్మతో పాటు వంశీ, తేజా, వెంకటేశ్వరయ్య ఉన్నారని దంపతులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్