రాజంపేట: సిగ్గు లేకుండా ఫేక్ ప్రచారం: చమర్తి

602చూసినవారు
టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు శనివారం వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ఉనికిని చాటుకోవడానికి సిగ్గులేకుండా ‘వెన్నుపోటు’ వంటి ఫేక్ ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజంపేటలో మాట్లాడుతూ, టీడీపీ రెండేళ్ల ప్రజారంజక పాలనను పూర్తి చేసి సంబరాలు జరుపుకుంటుందని తెలిపారు. వైసీపీకి రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళిక లేదని, మూడు రాజధానులు వంటి మార్పులే ఇందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్