రాజంపేట మండలంలోని అత్తిరాల త్రేత్రేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అతికారి కృష్ణ మాట్లాడుతూ, తమ నాయకుడు త్వరగా కోలుకుని ప్రజా సేవలో మరింత చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిందని, అభిమానులను ఆనందపరిచిందని ఆయన పేర్కొన్నారు.