రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో హత్యరాల శ్రీశ్రీశ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు సౌకర్యవంతమైన అనుభవం కల్పించేలా, క్యూలైన్‌లో సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం సబ్ కలెక్టర్, ఏఎస్పీతో కలిసి ఆలయ పరిసరాలు, బహుద్ నది, దేవస్థానం పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు, హత్యరాల చైర్మన్, టీడీపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.