సిద్ధవటం మండల గ్రామ శివారులోని కమ్మపాలెం సమీపంలో మంగళవారం ఒక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సిద్దవటం పోలీసులు పేర్కొన్నారు.