అన్నమయ్య జిల్లా రాజంపేటలో కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండా ఇసుక మాఫియా యథావిధిగా ఇసుక తవ్వకాలు చేపడుతోందని
కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాత్రి 10 గంటలకు రాజంపేట వైపు నుంచి టిప్పర్లు నీటితో తిరుపతి రోడ్డులో వెళ్తున్నాయని, ఇది అధికారుల వైఫల్యాన్ని సూచిస్తోందని మాజీ పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ అన్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.