సిద్దవటం: అదుపుతప్పిన ఆటో బోల్తా – డ్రైవర్‌కు గాయాలు

781చూసినవారు
సిద్దవటం: అదుపుతప్పిన ఆటో బోల్తా – డ్రైవర్‌కు గాయాలు
మంగళవారం సాయంత్రం సిద్ధవటం-భాకరాపేట ప్రధాన రహదారిలో అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఒక ఆటో ప్రమాదానికి గురైంది. భాకరాపేట నుండి సిద్ధవటం వైపు వస్తున్న ఆటో, ఎదురుగా వచ్చిన బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, రాజంపేటకు చెందిన భవనాసి వెంకటేష్‌కు గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్