సుండుపల్లె: ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలఆకస్మిక తనిఖీలు

84చూసినవారు
సుండుపల్లె: ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలఆకస్మిక తనిఖీలు
సుండుపల్లెలో నడుస్తున్న ప్రైవేట్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఫర్హా ఖానం, డాక్టర్ దిలీప్ గుప్తా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో, ఆర్‌ఎంపీలు ప్రభుత్వ శిక్షణా సర్టిఫికెట్లు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. కేంద్రాలు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా అని పరిశీలించిన వైద్యులు, తనిఖీల్లో తేలిన అంశాలపై సమగ్ర నివేదికను జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్