సుండుపల్లి: బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పురుషోత్తం

606చూసినవారు
సుండుపల్లి: బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పురుషోత్తం
సుండుపల్లి మండలంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి నిమ్మనపల్లి పురుషోత్తం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిష్ట పెంచేందుకు ప్రతి కార్యకర్త ముందుండాలని పిలుపునిచ్చారు. ఎంసీఆర్ కళ్యాణ మండపంలో బీజేపీ అధ్యక్షుడు రమణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, 40 బూత్‌ల కార్యకర్తలు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు, చరిత్ర, సోషల్ మీడియా వినియోగం, కార్య విస్తరణ అంశాలపై నేతలు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్