సుండుపల్లి: మానవతా సంస్థ శాంతిరథం ఏర్పాటు

3చూసినవారు
సుండుపల్లి: మానవతా సంస్థ శాంతిరథం ఏర్పాటు
సుండుపల్లి మండలంలో త్వరలో శాంతిరథం ఏర్పాటు చేయనున్నట్లు మానవతా సంస్థ జిల్లా ఆర్థిక కార్యదర్శి, ఉపాధ్యాయుడు హరికుమార్ తెలిపారు. ఆదివారం సుండుపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో మానవతా సేవా కార్యక్రమాలను వివరించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్