శనివారం పుల్లంపేటలో జరిగిన ఎంపికలలో సుండుపల్లె మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అభి, బాలికల విభాగంలో సంధ్య, సీనియర్ మెన్ విభాగంలో పూర్వవిద్యార్థులు కార్తీక్, ఆంజనేయులు ఎంపికయ్యారని ఫిజికల్ డైరెక్టర్ సంధ్య రాణి తెలిపారు. సబ్ జూనియర్స్ పోటీలు అక్టోబర్ 4–6న శ్రీకాకుళంలో, సీనియర్ మెన్ పోటీలు నవంబర్‌లో గుంటూరులో జరుగనున్నాయి.