యానాదులపై దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి

4చూసినవారు
యానాదులపై  దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
రాజంపేట మండలం మదనగోపాలపురం పంచాయతీ అన్నమయ్య యానాది కాలనీలో వేరే గ్రామానికి చెందిన పందుల కాపరి వెంకటేష్ అక్రమంగా స్థలం ఆక్రమించి గుడిసె వేసుకుని మద్యం సేవించి యానాదుల ను దూషిస్తూ అసభ్య పదజాలంతో మహిళలను తిడుతూ ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నాడు. ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా అతడి తీరుమారకపోవడంతో సమస్య సంఘం దృష్టికి తీసుకుని వచ్చారు. నేడు రాజంపేట సబ్ కలెక్టర్ ను కలసి యానాదులపై దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని రెవిన్యూ అధికారులు సదరు వ్యక్తి ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్