రాజంపేటలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తనపై రాజకీయ కక్షతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేద రైతుల భూముల్లో ముందస్తు నోటీసులు లేకుండా చర్యలు చేపట్టడం అన్యాయమని, చక్రాలమడుగు సహా కోట్ల రూపాయల విలువైన భూ ఆక్రమణలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు.