గిరిధర్ రాజుపై హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

433చూసినవారు
గిరిధర్ రాజుపై హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
రాజంపేటలోని బోయనపల్లిలో గిరిధర్ రాజుపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద పాత కక్షలతో దాడి జరిగినట్లు తెలిపారు. ఆలమూరి వెంకట కార్తీక్ రెడ్డి, గుడ్డం ఎర్రి స్వామి రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మార్కెట్ యార్డు ప్రాంతం నుంచి 3 ఇనుప రాడ్లు, 8 కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మనోజ్ రాంనాధ్ హెగ్డే, మన్నూరు సీఐ లింగప్ప వెల్లడించారు.

సంబంధిత పోస్ట్