రాజంపేటలో రెండు వాహనాలు ఢీ..: 9 మందికి గాయాలు

6364చూసినవారు
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు పెట్రోల్ బంకు సమీపంలో టాటా ఏస్, తుఫాన్ వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్