ఆగని గజరాజుల దాడులు.. రైతుల్లో ఆందోళన

2316చూసినవారు
ఆగని గజరాజుల దాడులు.. రైతుల్లో ఆందోళన
సుండుపల్లి మండలంలో గత నెల రోజులుగా ఏనుగుల గుంపు పంట పొలాలు, మామిడి తోటలపై దాడులు చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తోందని రైతులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆరోగ్యపురం–పరికిబండ అటవీ ప్రాంతంలో మళ్లీ సంచరించిన ఏనుగులను అటవీ శాఖ సిబ్బంది టపాకాయలు, డప్పులతో తరిమేందుకు ప్రయత్నించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏనుగులను తిరిగి అడవిలోకి తరలించాలని రైతులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్