తిమ్మసముద్రం గ్రామంలోని మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పీఎండీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే పంటల సాగు, పశువులకు మేత, పాల దిగుబడి పెంపు, భూమిలో నత్రజని, కర్బన శాతం పెంపు లక్ష్యంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పథకం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు ఎంతో ఉపయోగకరమని శనివారం తెలిపారు. ఎఫ్‌ఎమ్‌టీఎం రామ్మోహన్ మహిళా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.