వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట: భానుగోపాల్ రాజు

56చూసినవారు
వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట: భానుగోపాల్ రాజు
వీరబల్లి మండల టీడీపీ అధ్యక్షులు భానుగోపాల్ రాజు ఆదివారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే ఓర్వలేక చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్