ఊటుకూరులో యువకుల వీరంగం – ఇద్దరికి తీవ్ర గాయాలు

572చూసినవారు
ఊటుకూరులో యువకుల వీరంగం – ఇద్దరికి తీవ్ర గాయాలు
రాజంపేట మండలం ఊటుకూరులో ఐదుగురు యువకులు కత్తులు, కట్టెలతో గురువారం వీరంగం సృష్టించారు. ఈ దాడిలో లక్కాకుల బాబు, సాంబారు రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో లక్కాకుల బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. దాడి అనంతరం యువకులు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుని పోలీసులను బెదిరించినట్లు సమాచారం. పోలీసులు 108 అంబులెన్స్ సహాయంతో గాయపడిన మరో ముగ్గురిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్