అన్నమయ్య: గాలిపటం ఎగరేస్తూ.. విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

646చూసినవారు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోరాన్‌చెరువులోని బూచేవాండ్లపల్లెకు చెందిన ఆనంద శ్రీనివాస్(5) సాయంత్రం ఇంటిపై గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి సెలవులు కావడంతో బాలుడు అమ్మమ్మ ఇంటి వద్ద ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్