అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సూచనల మేరకు, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ శనివారం సాయంత్రం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వాహనదారులకు పోలీసులు సూచనలు, హెచ్చరికలు అందజేశారు. 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇవ్వకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, లోడుతో వేగంగా నడపడం, ఆటోల్లో అధిక ప్రయాణికులు ఎక్కించుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు.