అన్నమయ్య: తప్పిపోయిన బాలికల కేసు సుఖాంతం!

1584చూసినవారు
అన్నమయ్య: తప్పిపోయిన బాలికల కేసు సుఖాంతం!
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పర్యవేక్షణలో 12 ప్రత్యేక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా, గాలివీడు మండలం అరవీడు గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి బాలికలు జాస్మిన్, జుబేదాలను నెల్లూరు జిల్లాలోని కసుమూరు దర్గా వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తించారు. నెల్లూరు పోలీసుల సహకారంతో బాలికలను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు వన్ స్టాప్ సెంటర్, నెల్లూరులో ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గాలివీడు ఎస్సై రామకృష్ణ, మహిళా పిఎస్ఐ సుస్మిత ఆధ్వర్యంలో బృందం బాలికలను జిల్లాకు తీసుకురానుంది.
Job Suitcase

Jobs near you