మాదక ద్రవ్యాల నిర్మూలనకు బయో-చెక్ పరీక్షలు: డీఎస్పీ

532చూసినవారు
మాదక ద్రవ్యాల నిర్మూలనకు బయో-చెక్ పరీక్షలు: డీఎస్పీ
రాయచోటి సబ్‌డివిజన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ శుక్రవారం తెలిపారు. అనుమానిత వ్యక్తులకు బయో-చెక్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, గత 15 రోజుల్లో మాదక ద్రవ్యాలు సేవించినా కేవలం ఒక్క నిమిషంలోనే ఫలితం వస్తుందని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు 50 కిట్లు అందజేసినట్లు చెప్పారు. రాయచోటి పరిధిలో 15 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపడుతున్నామని, యూపీ, బీహార్‌కు చెందిన మైనర్ బాలురే ఎక్కువగా గుర్తించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్