లక్కిరెడ్డిపల్లెలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ బీఎల్‌ఏల శిక్షణ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో బీఎల్‌ఏలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని శనివారం పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయని, తుది ఓటరు జాబితా విడుదలయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.