చిన్నమండెం: గుండెపోటుతో ఉపాధ్యాయుడి హఠాన్మరణం

7చూసినవారు
చిన్నమండెం: గుండెపోటుతో ఉపాధ్యాయుడి హఠాన్మరణం
చిన్నమండెం ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు రవికుమార్ (50) శుక్రవారం రాయచోటిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కడపలో నివసించే ఆయన, రాయచోటికి వ్యక్తిగత పనులపై వచ్చి, బస్టాండులో కడప వెళ్లే బస్సు ఎక్కుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆర్టీసీ సిబ్బంది 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉపాధ్యాయుడి ఆకస్మిక మృతిపై పాఠశాల హెచ్ఎం, ఎంఈవో-2, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్