ఇంటి నిర్మాణంపై వివాదం

136చూసినవారు
ఇంటి నిర్మాణంపై వివాదం
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పెద్దూరు గ్రామానికి చెందిన షేక్ మొయిద్దీన్ భాష కుటుంబం తమ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపడుతుండగా వివాదం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. సర్వే నెంబర్ 1299/2లో ఉన్న ఈ స్థలంలో తమ కుటుంబం 40 సంవత్సరాలుగా నివసిస్తూ పన్నులు చెల్లిస్తోందన్నారు. పాత ఇల్లు కూల్చి కొత్త నిర్మాణం ప్రారంభించగా, పక్కింటి మహబూబ్ బాషా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, తమకు భద్రత కల్పించి ఇల్లు నిర్మాణం పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్