వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించాలి: శ్రీనివాసులు

75చూసినవారు
వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించాలి: శ్రీనివాసులు
రామాపురం మండలం కుమ్మరపల్లి ప్రజలకు వెంటనే శుద్ధి చేసిన తాగునీరు అందించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నీటిని గ్రామీణ తాగునీటి అవసరాలకు కేటాయించి, పైప్‌లైన్‌లు, ఫిల్ట్రేషన్ వ్యవస్థల ద్వారా కుమ్మరపల్లికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తాగునీరు ప్రజల మౌలిక హక్కు అని, నిర్లక్ష్యం చేస్తే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్