రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం, 04.02.2026న, ఉన్నత విద్య శాఖ కమిషనర్ డాక్టర్ మునియా నాయక్ ఆదేశాల మేరకు ఎంటర్ ప్రీన్యూర్షిప్ సెల్ ఆధ్వర్యంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రతన్ టాటా హబ్ సహకారంతో విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సుకు ఉర్దూ అధ్యాపకులు ఎండి. పైజూల్లా, తెలుగు అధ్యాపకురాలు బి. శివమ్మ అధ్యక్షత వహించారు.