గాలివీడు మండలంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ విస్తృతంగా తనిఖీ చేశారు. బస్సుల ఫిట్‌నెస్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నమాపక కార్యక్రమాలు, అత్యవసర ద్వారాలు తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతా దృష్ట్యా స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్‌గా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.