రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

4చూసినవారు
రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
రాయచోటిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధేయ విలువలను జీవితంలో అలవర్చుకోవాలని అధ్యాపకులు సూచించారు. విద్యార్థులు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాత్ర, మహిళా సాధికారత, గ్రామాభివృద్ధిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. NSS విభాగం, విద్యార్థులు 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్