మిట్టా వాండ్లపల్లిలో రూ. 73 వేల ధర పలికిన వినాయకుడి లడ్డూ

13చూసినవారు
మిట్టా వాండ్లపల్లిలో రూ. 73 వేల ధర పలికిన వినాయకుడి లడ్డూ
రాయచోటి నియోజకవర్గంలోని మిట్టా వాండ్లపల్లిలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత, మాజీ కౌన్సిలర్ మిట్టా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వినాయకుడి లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో లడ్డూకు భారీ ధర పలికింది. వేలం పాటలో మిట్టా భరత్ కుమార్ రెడ్డి రూ. 73, 000లకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. అలాగే దేవపట్ల ఈశ్వర్ మరో లడ్డూను రూ. 40, 000లకు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్