గాలివీడు మండలం పెద్దూరు రోడ్డులోని ఒక ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో నగలు, బట్టలు, విలువైన పత్రాలు కాలిపోయి సుమారు రూ.10 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు పెద్దపోల్ల మునిరాజా తెలిపారు. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకురాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విచారణ చేపట్టారు.