న్యూఢిల్లీలోని ట్రాన్స్పోర్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రూ.500 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతిలో అభివృద్ధి చేయనున్న ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుకు పాక్షిక అనుమతి లభించిందని, డిజైన్ పోటీలో 26 సంస్థలు పాల్గొన్నాయని అధికారులు వివరించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రాజెక్టును వేగవంతం చేసి, తిరుపతి నగరానికి ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి తేవాలని కోరారు.