శుక్రవారం రాయచోటిలో జరిగిన "ఒక నియోజకవర్గం – ఒక మండలం – నాలుగు సందర్శనలు" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, తహసీల్దార్లు, ఆర్డీఓలకు ఉన్న అధికారాలపై అవగాహన కల్పించి జిల్లా స్థాయికి వచ్చే అనవసర దరఖాస్తులను తగ్గించాలని సూచించారు. భూ వివాదాలు, 22-ఏ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి అధికారి క్రమం తప్పకుండా గ్రామాల సందర్శనలు చేయాలని ఆదేశించారు.